డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ
అమెరికా అధ్యక్ష పదవి నుండి మరో నెల రోజుల్లో దిగనున్న డొనాల్డ్ ట్రంప్ వలస విధానాన్ని రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువడింది. ఒబామా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులతో పాటు మైనారిటీ పిల్లలుంటే వారి బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రభుత్వం చట్టం తెచ్చింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒబామా విధానాన్ని రద్దు చేసింది. అయితే ఇప్పుడు అమెరికా ట్రంప్ మూడేళ్ల క్రితం రద్దుచేసిన చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి నికొలస్ ఆదేశించారు. మరో రెండేళ్లవరకు ఈ చట్టాన్ని అమలు చేయాలని తన ఆదేశంలో ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన రక్షణ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. భారత్ నుంచే లక్షలాదిమంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. ప్రస్తుతం వీరి పిల్లలకు ఈ చట్ట పునరుద్ధరణ వల్ల ఎంతో ప్రయోజనం కలుగనున్నది.






