ఈ అంశంలో జోక్యం చేసుకోం… దీనిపై మేము స్పష్టంగా ఉన్నాం
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై జస్టిన్ ట్రూడో ఆరోపణలు, భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం న్యూఢిల్లీ, వాషింగ్టన్ డీసీ మధ్య సంబంధాలను మరింత దిగజార్చుతుందన్న వార్తలను అమెరికా ఖండించింది. వాషింగ్టన్ ఆధారిత పబ్లికేషన్ పొలిటికోలో వై బిడెన్స్ మమ్ ఆన్ ది ఇండియా` కెనడా స్పేట్ అనే శీర్షికతతో యూఎస్ ఎంబసీ ఈ తిరస్కరణ ప్రకటనను జారీ చేసింది. భారత్, అమెరికా సంబంధాలు మరింత దిగజారవచ్చు భారతీయ అధికారులతో అమెరికా తన సంప్రదింపులను తగ్గించుకోవాల్సి ఉంటుంది అని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తన బృందానికి చెప్పినట్లు వచ్చిన ఆరోపణల్ని భారత్‌లోని యూఎస్ ఎంబీసీ తోసిపుచ్చింది.
భారత్, అమెరికా ప్రజలు, ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి గార్సెట్టి ప్రతిరోజూ తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఆయన తో పాటు భారత్‌లోని అమెరికా మిషన్, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది అని పేర్కొంది. కెనడా, భారత్ అంశంలో మేం జోక్యం చేసుకోం. దీనిపై మేము స్పష్టంగా ఉన్నాం. మాపై వస్తున్న ఈ ఆరోపణలు తీవ్రమైనవి. అవిపూర్తిగా దర్యాప్తు చేయబడాలి. వాస్తవానికి, మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా భారత్‌తో బలమైన సంబంధాల్ని కోరుకుంటున్నాం అని వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల కో ఆర్డినేటర్ జాన్ కిర్బీ తెలిపారు.






