ప్రతినిధుల సభ ఆమోదించినా.. సెనెట్‌లో అనుమానమే
అమెరికా పార్లమెంటులోని ప్రజా ప్రతినిధుల సభ (కాంగ్రెస్) తుపాకుల నియంత్రణ బిల్లును 223-204 ఓట్ల తేడాతో ఆమోదించింది. డెమోక్రాటిక్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ప్రతిపక్ష రిపబ్లిన్ పార్టీకి చెందిన అయిదుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అయితే పాలక, ప్రతిపక్షాలకు సమాన బలం ఉన్న ఎగువ సభ సెనెట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందకపోవచ్చు. చంపేది తుపాకులు కావు, మనుషులే అన్న తుపాకుల లాబీ నినాదాన్ని నమ్మే రిపబ్లికన్లు వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించనున్నారు. పాఠశాలల్లో భద్రత పెంచాలనీ, తుపాకులు అమ్మే ముందు కొనుగోలు దారుల పూర్వపరాలను క్షుణంగా తనికీ చేయాలని కోరుతున్నారు. వీటిపై చర్చలతో సెనెట్ సరిపెట్టేట్లుంది తప్ప తుపాకులను గట్టిగా నియంత్రించే అవకాశం కనిపించడం లేదు.
50:50 గా చీలిన సెనెట్‌లో కనీసం 10 మంది రిపబ్లికన్ సెనెటర్ల మద్దతు లభిస్తే గానీ, దిగువ సభ ఆమోదించిన బిల్లు చట్టరూపం ధరించదు. దిగువ సభ ఆమోదించిన బిల్లు తుపాకులు కొనడానికి అర్హుమైన వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదిస్తోంది.






