Gold card: 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు

అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కొత్త పథకాన్ని ప్రకటించారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న ఈబీ-5 వీసా (EB-5 Visa) విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డు (Gold card) వీసాను తీసుకొచ్చారు. రూ.43.5 కోట్లు ( 50 లక్షల డాలర్లు) వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని ప్రకటించారు. గోల్డ్ కార్డుతో అమెరికా (America) కు వచ్చినవారు మరింత సంపన్నులవుతారు. వ్యాపారాల్లో విజయవంతమవుతారు. బాగా డబ్బు ఖర్చు చేస్తారు. భారీగా పన్నులు చెల్లిస్తారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తారు. ఈ పథకం భారీగా విజయవంతం అవుతుందని అనుకుంటున్నాం అని ట్రంప్ పేర్కొన్నారు. తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దానికి కోటికి చేర్చాలని భావిస్తున్నామని తెలిపారు. గోల్డ్ కార్డు వీసాల్లో ఉద్యోగ సృష్టి వంటి అంశాలను ట్రంప్ వెల్లడిరచలేదు. దీనిని రష్యా (Russia) కు చెందిన కుబేరులకూ విక్రయించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. గోల్డ్ కార్డు విక్రయాల ద్వారా ఖజానాకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.