అమెరికాలో దారుణం… బ్యాలెట్ బ్యాక్సులకు
అమెరికాలో నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, ఓరేగాన్లో దారుణం చోటుచేసుకొంది. ఈ ప్రాంతాల్లోని బ్యాలెట్ బాక్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఓరేగాన్లోని పోర్ట్లాండ్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో మంటలు చెలరేగి మూడు బ్యాలెట్ బాక్సులు దెబ్బతిన్నాయి. వాషింగ్టన్లోనూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడి బ్యాలెట్ బాక్సులకు ఎటువంటి నష్టం జరగలేదని వెల్లడిరచారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనగా పోర్ట్లాండ్ పోలీసు అధికారి తెలిపారు. మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడిరచారు.






