అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ జయభేరి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం లాంఛనమే. అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. దీంతో పాటు మరో నాలుగు స్వింగ్ స్టేట్స్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..ట్రంప్ 267 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. మరో మూడు ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే అధ్యక్షుడిగా ట్రంప్ విజయం ఖరారైనట్లే..! అత్యంత కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా రిపబ్లికన్ల వశమయ్యాయి. నెవడా, మిషిగన్, ఆరిజోనా, విస్కాన్సిన్లోనూ ట్రంప్ ముందంజలో దూసుకెళ్తున్నారు.






