మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్
కొద్దినెలల క్రితం ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. అత్యవసర ఆరోగ్య సమస్య తో వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ సెంటర్లో చేరారని పెంటగాన్ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఆస్టిన్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడిన ఆయనకు సర్జరీ జరిగింది. అనంతరం తీవ్ర నొప్పితో జనవరి ఒకటిన మరోసారి వైద్యులను సంప్రదించారు. జనవరి 15 వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. కొద్దిరోజుల ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తించిన ఆయన జనవరి 29న పెంటగాన్‌కు వచ్చారు. తాజాగా బ్లాడర్ సమస్య ఎదురైంది. దాంతో తన రక్షణ శాఖ బాధ్యతలను ఆయన డిప్యూటీ మంత్రి కాథ్లీన్ హిక్స్‌కు బదిలీ చేశారు.






