Pete Hegseth: ఈ విషయంలో భారత్‌కు తమ మద్దతు : పీట్ హెగ్సేత్

భారత్‌కు తనని తాను రక్షించుకునే హక్కు ఉందని, ఈ విషయంలో భారత్‌కు తమ మద్దతు ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ (Pete Hegseth) పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై చేసే పోరులోనూ భారత్ (India) కు తమ అండ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh )తో ఫోన్‌లో మాట్లాడిన పీట్ పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పెహల్గాం (Pahalgam) ఘటనతో పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తుందనే విషయం రుజువైందని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా పీట్‌తో అన్నారు. ఈ మేరకు వారి మధ్య జరిగిన సంభాషణపై కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.