చైనా చేతికి అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రహస్యాలు!
తన ఈమెయిల్స్ ను చైనా గూఢచారులు హ్యాక్ చేశారని ఎఫ్‌బీఐ వెల్లడించినట్లు అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు డాన్ బేకన్ వెల్లడించారు. దీంతో వ్యక్తిగత, ప్రచారానికి సంబంధించిన సున్నితమైన సమాచారం చోరికి గురైనట్లు ఆయన తెలిపారు. డేటా అంతా హ్యాక్ అయినట్లు ఎఫ్‌బీఐ తనను హెచ్చరించినట్లు బేకన్ పేర్కొన్నారు. దాదాపు నెల నుంచి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తన ఖాతాలను యాక్సెస్ చేసిందని తెలిపారు. తమ సాఫ్ట్‌వేర్‌లోని కొన్ని లోపాలను హ్యాకర్లు వినియోగించుకొంటున్నారని మైక్రోసాఫ్ట్ సంస్థ గత నెలలో ప్రకటించిన సమయంలో తన మెయిల్స కూడా హ్యాక్ అయినట్లు బేకన్ తెలిపారు. హ్యాక్ అయిన మెయిల్స్‌లో బ్యాంకింగ్, రాజకీయ వ్యూహాలు, విరాళాల సేకరణ ప్రచార కార్యక్రమాల వివరాలు ఉన్నట్లు వెల్లడిరచారు. ఈ సైబర్ ఆపరేషన్‌లో ఇతర బాధితులు కూడా ఉన్నారు. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో మాకు స్నేహం లేదు. వారు చాలా ఎక్కువగా సైబర్ గూఢచర్యానికి పాల్పడుతున్నారని అని బేకన్ అన్నారు.






