Deepseek : ప్రభుత్వ డివైజ్‌లలో డీప్‌సీక్ వద్దు : అమెరికా

తక్కువ ఖర్చుతో చైనా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ మోడల్ డీప్‌సీక్ (Deepseek ) ను ప్రభుత్వానికి చెందిన అధికారిక డివైజ్‌లలో ఇన్‌స్టాల్ (Install ) చేయొద్దని అమెరికా వాణిజ్యశాఖ తమ ఉద్యోగుల (Employees)కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ డేటా సురక్షితంగా ఉండాలంటే డీప్‌సీక్‌కు దూరం పాటించాలని ఈ శాఖ ఉద్యోగులకు మెయిల్ పంపినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. డీప్‌సిక్‌కు సంబంధించిన ఏవైనా అప్లికేషన్‌లు, డెస్క్‌టాప్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను ప్రభుత్వానికి సంబంధించిన డివైజ్‌లలో డౌన్‌లోడ్ చేయడం, వీక్షించడం, యాక్సెస్ చేయడం వంటివి చేయకూడదు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి వాణిజ్య శాఖకు చెందిన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నిబంధనలను పాటించాలి అని అధికారులు మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలు ఎంతకాలం అమల్లో ఉంటాయనే విషయం తెలియాల్సి ఉంది. వర్జీనియా(Virginia), టెక్సాస్(Texas), న్యూయార్క్ (New York) తో సహా అనేక రాష్ట్రాలు ప్రభుత్వ పరికరాల నుంచి ఇదివరకే డిప్‌సీక్‌ను నిషేధించాయి.