యూఎస్ కేపిటల్ చీఫ్ స్టీవెన్ సుండ్ రాజీనామా
అమెరికా ఘటన దృష్ట్యా పలువురు యూఎస్ అధికారుల రాజీనామాలకు తెరపడటం లేదు. క్యాపిటల్ భవనం వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో వైట్‌హౌస్ ఉన్నతాధికారులు పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి బాటలోనే తాజాగా కేపిటల్ చీఫ్ స్టీవెన్ సుండ్ రాజీనామా చేశారు. యూఎస్ కాపిటల్ పై హింసాత్మక ఘటనకు పాల్పడిన గుంపును నిరోధించడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న యూఎస్ కాపిటల్ పోలీస్ చీఫ్ స్టీవెన్ తన పదవికి రాజీనామా చేసినట్లు యూఎస్ కాపిటల్ పోలీసు అధికారులు తెలిపారు. స్టీవెన్ సుండ్ రాజీనామా జనవరి 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సమాచారం.






