America :ఉక్రెయిన్‌కు అమెరికా సాయం పునరుద్ధరణ

ఉక్రెయిన్‌కు సాయాన్ని అమెరికా (America) పునరుద్ధరించింది. దీంతోపాటు నిఘా సమాచారాన్నీ పంచుకోవడానికి అంగీకరించింది. సౌదీ అరేబియా (Saudi Arabia )లోని జెడ్డాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని అమెరికా వెల్లడిరచింది. మరోవైపు చర్చలు నిర్మాణాత్మక ప్రారంభానికి నాంది పలికాయని ఉక్రెయిన్ ప్రకటించింది. శ్వేతసౌధంలో ట్రంప్ (Trump )తో జెలెన్ స్కీ (Zelensky) వాగ్వాదం, వాకౌట్ తర్వాత ఈ చర్చలు అతి పెద్ద ఉపశమనాన్ని కలిగించాయని సమావేశంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీయ్ యెర్మాక్ పేర్కొన్నారు. చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పాల్గొన్నారు. శాంతి ఒప్పందం కోసం 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో తేల్చి చెప్పారు.