ట్విట్టర్ సంచలన నిర్ణయం …
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టడం వల్లే ఆయన మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకొన్నది. ట్రంప్ ట్విట్టర్ ఖాతా realDonaldTrumpను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ట్విట్టర్ తన వ్యక్తిగత ఖాతాను నిషేధించడంతో @POTUS (అధ్యక్షుడి అధికారిక ఖాతా) ఖాతా నుంచి ట్రంప్ స్పందించారు. సొంత వెబ్సైట్ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను రద్దు చేయడంపై ప్రముఖ ఇండో అమెరికన్ రాజకీయవేత్త నిక్కీ హేలీ సహా రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాట్లాడే స్వేచ్ఛను హరించడానికి ఇది చైనా కాదు..అమెరికా అని పేర్కొన్నారు. ట్విట్టర్ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక హెచ్చరిక అని బీజేపీ ఎంపీ, పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు తేజస్వీ సూర్య అన్నారు.






