Gold Card: గోల్డ్ కార్డుల కోసం క్యూ

అమెరికాలో శాశ్వత నివాసం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ ( గోల్డెన్ వీసా) లకు మంచి ఆదరణ లభిస్తోందని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ (Howard Lutnick) తెలిపారు. ఎవరైనా అయిదు మిలియన్ డాలర్లు ( సుమారు రూ.43 కోట్లు) చెల్లించి అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండొచ్చు. అమెరికా పౌరసత్వం తీసుకోవాలా, వద్దా అన్నది వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. శాశ్వత పౌరసత్వం తీసుకున్న మధ్యలో రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ గోల్డెన్ వీసా (Golden Visa ) పొందడానికి చాలా మంది లైనులో ఉన్నారని లట్నిక్ చెప్పారు. కేవలం ఒక్క రోజులోనే 1,000 కార్డులు విక్రయించామని తెలిపారు. ఈ పథకాన్ని రెండు వారాల్లో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఎలాన్ మస్క్ రూపొందిస్తున్నారని తెలిపారు.