Gold card :అతి త్వరలో ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలు .. డోజ్ సాఫ్ట్‌వేర్ తయారీ!

సంపన్న వలసదారుల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )ప్రతిపాదించిన గోల్డ్ కార్డు (Gold card) త్వరలోనే జారీ చేయనున్నారు. ట్రంప్ సన్నిహితుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk )కు ఆ బాధ్యతలు అప్పగించారు. మస్క్ నాయకత్వం వహిస్తున్న డోజ్ గోల్డ్‌కార్డు కోసం సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తోంది. గోల్డ్ కార్డు ప్రాజెక్టుకు మార్కో ఎలెజ్ (Marco Elez), ఎడ్వర్ కొరిస్టీన్ నాయకత్వం వహిస్తున్నారు. నెలరోజులుగా వారు దీనిపై పనిచేస్తున్నారు. వీసా, ఇమిగ్రెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షించే వివిధ ఏజెన్సీల అధికారులతో సమావేశమై ప్రస్తుతం ఉన్న ప్రక్రియలను తమ కొత్త వ్యవస్థలో ఎలా చేర్చుకోవచ్చనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న కార్డు భవిష్యత్‌లో మార్పులుండొచ్చని, ఇందుకు సంవత్సరాలు పట్టవచ్చని వెల్లడిరచింది. అయితే హోల్డర్లు అమెరికా పౌరులు అవుతారా లేదా అనే దానిపై వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టత ఇవ్వలేదు.