Donald Trump : తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన తొలి క్యాబినెట్ సమావేశం (Cabinet meeting) నిర్వహించారు. క్యాబినెట్‌లో సభ్యుడు కాకపోయినా ఈ భేటీకి డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) హాజరయ్యారు. తొలుత ఆయననే మాట్లాడాలని ట్రంప్ కోరారు. సెనెట్ ఆమోదం తెలిపిన పలువురు క్యాబినెట్ సహచరులు ఈ సమావేశానికి వచ్చారు. మనం ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. మస్క్‌తో సంతోషంగా ఉన్నారా అని సహచరులను ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మస్క్ సమాధానాలిస్తుండగా ట్రంప్ జోక్యం చేసుకుని క్యాబినెట్ సభ్యులు సమాధానం (Answer) చెప్పాలని కోరారు. ఎవరైనా తమతో విభేదిస్తే వారిని బయటకు విసిరేస్తానని సరదాగా ఆయన వ్యాఖ్యానించారు.