ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ క్లీన్‌స్వీప్ : క్రిస్టోఫ్ బరౌడ్
నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని ప్రముఖ ఆర్థికవేత్త క్రిస్టోఫ్ బరౌడ్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. బెట్టింగ్ మార్కెట్లు, పోల్స్, ఎన్నికల విశ్లేషకుల అంచనాలు, ఆర్థిక మార్కెట్లు వంటి విభిన్న కొలమానాలను పరిశీలిస్తే, అత్యంత సంభావ్య ఫలితాలు ట్రంప్ విజయాన్నే సూచిస్తున్నాయని బరౌడ్ పేర్కొన్నారు. మొనాకో మార్కెట్ సెక్యూరిటీస్‌లో చీఫ్ ఎకానమిస్ట్, స్ట్రాజిస్టు అయిన బరౌడ్ బ్లూమ్‌బర్గ్ ఆర్థిక అంచనా ర్యాంకుల్లో టాప్‌లో ఉన్నారు. గత 12 ఏళ్లలో 11 సార్లు ఆయన అంచనాలు కరెక్టయాయయి.






