అమెరికాలో నయా ఫ్యాషన్ .. ట్రంప్ మద్దతుదారుల్లో
అమెరికాలో నయా ఫ్యాషన్ పుట్టుకొచ్చింది. అదే కుడిచెవికి బ్యాండేజీ. హత్యా యత్నంలో గాయమైన తన కుడిచెవికి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బ్యాండేజీ వేసుకున్నారు. మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ కన్వెన్షన్‌కు బ్యాండేజీతోనే హాజరయ్యారు. చావుకు అతిసమీపంగా వెళ్లిన ట్రంప్ ప్రదర్శించిన మొక్కవోని దైర్యాన్ని ఆయన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఈ బ్యాండేజీ గుర్తు చేస్తోంది. దాంతో మద్దతుదారులు, రిపబ్లికన్ డెలిగేట్లు ట్రంప్‌కు సంఫీుభావంగా తమ కుడిచెవికి ఇలా తెల్లని బ్యాండేజీ ధరిస్తున్నారు.






