Donald Trump : ట్రంప్ కీలక నిర్ణయం … మస్క్‌కు మద్దతుగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) , ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ (Doze) సారథిగా మస్క్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విభాగం సలహాలతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అగ్రరాజ్యంలో మస్క్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల టెస్లా (Tesla) ను బహిష్కరించాలంటూ అమెరికాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మస్క్‌కు మద్దతుగా కొత్త టెస్లా కారు (Tesla car)ను కొంటున్నట్లు ప్రకటించారు.
ఎలాన్ మస్క్ మన దేశాన్ని గొప్పగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం అతను అద్భుతంగా పని చేస్తున్నారు. కానీ రాడికల్ లెఫ్ట్ భావజాలం కలిగిన వ్యక్తులు కావాలనే, కుట్రపూరితంగానే టెస్లాను బహిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకు మద్దతుగా నేను సరికొత్త టెస్లాను కొనుగోలు చేయనున్నా. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో సహాయం చేస్తున్న అతడిని ఎందుకు శిక్షించాలి అని ట్రంప్ పేర్కొన్నారు.