Donald Trump: ఈయూపైనా సుంకాల మోత

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తాజాగా ఐరోపా కూటమిపై (ఈయూ) కన్నేశారు. తమకు మిత్రులైన ఆ దేశాలపైనా త్వరలోనే 25 శాతం సుంకాలను రెట్టింపు చేస్తానని ప్రకటించారు. ఇక కెనడా(Canada), మెక్సికోల (Mexico)పై విధించిన సుంకాలు మార్చి 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడిరచారు. రెండో విడత ప్రతీకార సుంకాలను ఏప్రిల్ (April) లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఈయూ (EU) ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న కార్లపై 10 శాతం సుంకాలను విధిస్తోంది. దీనికితోడు వ్యాట్, ఇతర పన్నులు కలిపి అది 17.5 శాతానికి చేరుతోంది. అదే సమయంలో అమెరికా కేవలం 2.5 శాతమే వసూలు చేస్తోంది. నాటో (NATO) లో సభ్యత్వంపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాలని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.