డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ప్రాజెక్టు రద్దు… పెంటగాన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ ప్రకటించింది. అమెరికా దక్షిణ సరిహద్దులోని ఈ గోడ నిర్మాణానికి నిధులు మళ్లించడం కోసం 2019లో జాతీయ ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. మిలటరీ నిధులను, బడ్జెట్‍లో కేటాయించిన ఖర్చు కా డా మురిగిపోయిన నిధులను ఉపయోగించి ఈ గోడ నిర్మాణానికి గత ట్రంప్ ప్రభుత్వం పూనుకుంది. జో బైడెన్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సరిహద్దు గోడ నిర్మాణ ప్రాజెక్టులన్నిటినీ ఆపేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అందచేస్తున్న నిధుల చట్టబద్ధతను, కాంట్రాక్ట్ పద్ధతులను సమీక్షించాలన్నారు. సైనికుల పిల్లలకు స్కూళ్ళ నిర్మాణానికి, విదేశాల్లో భాగస్వామ్య దేశాలతో కలిసి మిలటరీ నిర్మాణ కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి వుండగా వాటిని గోడ నిర్మాణానికి మళ్లించడాన్ని బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.