2024 అధ్యక్ష ఎన్నికల్లో … గెలుపు నాదే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‍పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏడాది నవంబర్‍లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవలేదని, తానే విజయం సాధించినట్టు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయిన ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే మిడ్‍టర్మ్ ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఓహియోలో జరిగిన ప్రచార తరహా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించనట్టు పేర్కొన్నారు.
అయితే వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేయనున్నట్టు చెప్పిన ట్రంప్ అందులో విజయం సాధించి, అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 91 నిమిషాలపాటు ప్రసంగించిన ట్రంప్.. హిల్లరీ క్లింటన్, నాన్సీ పెలోసి తదితర డెమొక్రటిక్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.