అప్పుడు చేం చేశానో చెప్పను : ట్రంప్
అమెరికాలో క్యాపిటల్ భవనం పై దాడి జరిగినపుడు తాను ఏం చేశానో చెప్పనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దాడి దృశ్యాలను టీవీలో చూశారా? మీ మద్దతుదారులకు ఫోన్ చేశారా ఇలా ఎన్నిసార్లు అడిగినా నేరుగా సమాధానం ఇవ్వడానికి ట్రంప్ ఇష్టపడ లేదు. ప్రశ్నను దాటవేసేందుకే ప్రయత్నించాడు. అప్పుడు ఏం చేస్తున్నానో చెప్పను. తర్వాత సరైన సమయంలో ప్రజలకు వివరిస్తా అని పేర్కొన్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని కాంగ్రెస్ ఖరారు చేస్తుందనగా, ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.






