డొనాల్డ్ ట్రంప్‌కు తైక్వాండో బ్లాక్ బెల్ట్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ కొరియా దిగ్గజ మార్సల్ ఆర్ట్స్ సంస్థ కక్కివొన్ ఆయనను 9వ ర్యాంక్ డాన్ బ్లాక్ బెల్టుతో సత్కరించింది. ప్రపంచ తైక్వాండో ప్రధాన కార్యాలయమైన కక్కివొన్ అధ్యక్షుడు లీ డాండ్ సియోప్ అమెరికాలోని ఫ్లోరిడాలో ట్రంప్ నివాసాని వెళ్లి ఈ అవార్డును స్వయంగా అందజేశారు. బ్లాక్ బెల్ట్ అందుకున్న అనంతరం ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే బెల్టు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. భవిష్యత్తులో మళ్లీ అమెరికా అధ్యక్షుడినైతే ఈ బ్లాక్ బెల్టు ధరించి కాంగ్రెస్‌కు హాజరవుతానని పేర్కొన్నారు.






