ఆమె ఒక ఫెయిల్యూర్.. గెలిస్తే మాత్రం
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీలోకి దిగేందుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఫ్లోరిడాలో జరిగిన ది బిలీవర్స్ సమ్మిట్ లో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ ఎన్నికల్లో ఆమె గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా దేశ చరిత్రలో మిగిలిపోతారంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్ ప్రజాదరణ కోల్పోయారు. దేశ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను సక్రమగా నిర్వహించలేదు. ఎంతోమంది అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నా అడ్డుకోలేదు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఒక ఫెయిల్యూర్ అంటూ నిప్పులు కురిపించారు.






