హెచ్ 1బీ వీసాదారులకు మరోసారి షాక్ ఇచ్చిన ట్రంప్
దేశీయ టెక్ కంపెనీలు, ఐటీ నిపుణలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. హెచ్ 1బీ వీసాల జారీపై ఉన్న నిషేధం డిసెంబర్ 31, 2020తో ముగిసిన నేపథ్యంలో వీటిపై నిషేధాన్ని మరో మూడు నెలల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డులు, ఇతర వర్కింగ్ వీసాల జారీపై ఉన్న ఆంక్షలను కూడా పొడిగించారు. మార్చి 31 వరకు ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ మండిపడ్డారు. మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న తమ సైనికులు, అధికారులపై దాడులు చేసినవారికి చైనా బహుమతులు ఇస్తున్నదని ట్రంప్ ఆరోపించారు. అమెరికా నిఘా వర్గాలు దీనిని గుర్తించాయని చెప్పారు.






