అమె ఎంతో నలిగిపోయారు : డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ట్రంప్ తల బయటకు కనిపించడంతో భద్రత కల్పించిన మహిళా అధికారిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ట్రంప్ స్పందించారు. ఆ మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు అండగా నిలిచారు. ఆమె తప్పేం లేదని, తనకు భద్రత కల్పించేందుకు ఆమె శాయశక్తులా ప్రయత్నించారని ప్రశంసించారు. మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ నాటి ఘటనను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె మంచి వ్యక్తి, నన్ను రక్షించేందుకు చేయగలిందంతా చేశారు. ఆ క్రమంలో ఎంతో నలిగిపోయారు. కానీ ఆమె నాకన్నా కాస్త ఎత్తు తక్కువగా ఉన్నారు. దీంతో సరిగా భద్రత కల్పించలేదని ఆమెపై విమర్శలు వచ్చాయి. కానీ ఆ మహిళ అధికారి ఎంతో ధైర్యవంతురాలు. నా కోసం బుల్లెట్లకు ఎదురొడ్డాలనుకున్నారు అని ప్రశంసించారు.






