మా ఈమెయిళ్లను హ్యాక్ చేశారు… ట్రంప్ ప్రచార బృందం ఆరోపణ
తమ ఈ మెయిళ్లు హ్యాక్ అయ్యాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం ఆరోపించింది. ఇరాన్ హ్యాకర్లు అంతర్గత రహస్య పత్రాల్లోని సమాచారాన్ని దొంగిలించి బహిరంగపరుస్తున్నారని పేర్కొంది. అయితే ఇరాన్ హ్యాక్ చేస్తోందడానికి ఆధారాలను వారు వెల్లడిరచలేదు. ఇరాన్ హ్యాకర్లు అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారనే అనుమానాలను మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసిన నేపథ్యంలో ట్రంప్ ప్రచార బృందం ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. వీటిని ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ ప్రతినిధి ఖండిరచారు. అందులో ఎటువంటి విశ్వసనీయత లేదని స్పష్టం చేశారు.






