Elon Musk :మస్క్ మెయిల్‌కు సమాధానం పంపాల్సిందే

ఫెడరల్ ఉద్యోగులు తమ పనిపై వివరణ ఇవ్వకపోతే రాజీనామా చేయాలని గడువు విధిస్తూ డోజ్ (Doze) విభాగాధిపతి మస్క్ చేసిన మెయిల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సమర్థించారు. మస్క్ మెయిల్ (Mail)కు బదులివ్వకపోతే వారిని పాక్షికంగాగానీ, పూర్తిగాగానీ ఉద్యోగాల నుంచి తొలగించినట్లేనని స్పష్టం చేశారు. చాలా మంది సమాధానమిచ్చేందుకు ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారు అసలు ఉనికిలోనే లేరు. ప్రభుత్వంలో వందల బిలియన్ డాలర్ల మేర జరుగుతున్న మోసాన్ని మస్క్ నేతృత్వంలోని డోజ్ గుర్తించింది. గతంలో విధుల్లో లేనివారికీ జీతాలు ఇచ్చినట్లు తెలిసింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.