Donald Trump : మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే..లేదంటే మీ దారి మీరు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే లేదంటే మీరు దారి మీరు చూసుకోండి అని తెగేసి చెప్పారు. రష్యా (Russia) చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్ (Ukraine ) లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శ్వేతసౌధాని (White House ) కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ (J.D. Vance ) లకు ఇది ఆగ్రహం తెప్పించింది. ముప్పావుగంటసేపు సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట్లాడే పద్ధతి ఇది కాదని ట్రంప్ ఖండిరచారు. మీరు చాలా ధైర్యవంతులు, కానీ మీరు మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. లేదంటే మేం తప్పుకొంటాం. అప్పుడు మీరొక్కరే పోరాడుకోవాలి. మాతో లాదేవీకి ఇది సరైన పద్ధతి కాదు. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా, అమర్యాదగా మీరు ప్రవర్తిస్తున్నారు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో మీరేం లేదు అని జెలెన్‌స్కీ వైపు వేలేత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. లక్షల మంది ప్రాణాలతో జూదమూడు తున్నారని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చర్చను అర్ధాంతరంగా ముగించేశారు.
అధ్యక్షుడి కార్యాలయానికి వచ్చి విలేకరుల సమక్షంలోనే ఇలా ఎలా మాట్లాడతారని వాన్స్ మండిపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ఓ ఉగ్రవాదిగా జెలెన్‌స్కీ అభివర్ణించారు. అలాంటి హంతకుని తో, నియంతతో రాజీపడాల్సిన అవసరం లేదన్నారు. శాంతి ఒప్పందం కుదరాలంటే కొన్నింట్లో రాజీపడక తప్పదని ట్రంప్ చెప్పారు. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే శ్వేతసౌధం నుంచి జెలెన్‌స్కీ బయటక వచ్చేశారు. ముందు అనుకున్న ప్రకారమైతే ఇద్దరూ సంతకాలు చేసి, సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఉలికిపాటు కలిగించాయి.