ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ.. స్వల్ప ఆధిక్యత కనబరిచిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. న్యూయార్క్ టైమ్స్, సియానా విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది. ఆస్తులను ఎక్కువ చేసి చూపి రుణాలు పొందడం, పార్లమెంట్‌పైకి తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాసరే సగం ఓటర్లు ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. కమలా హారిస్ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఆధిక్యత చూపారు. నెవడా, జార్జియా, నార్త్ కరోలినా, అరిజోనాలో ఇద్దరికీ గట్టి పోటీ ఉంది. మిషిగన్, విస్కాన్సిన్లో హారిస్ ఒక శాతం ఆధిక్యం కనబరిచారని, పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొందని సర్వేలో తేలింది.






