డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ
2022 ఎన్నికల సందర్భంగా జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 2024 లో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ముందున్న ట్రంప్‌పై ఈ అభియోగాలు నమోదు కావడం గమనార్హం. పుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ జారీ చేసిన 41-ఛార్జి డాక్యుమెంట్లో ట్రంప్ సహా 18 మందిపై వీటిని మోపారు. వీరిలో ట్రంప్ మాజీ లాయర్ రూడీ గులియానీ, మాజీ శ్వేతసౌధం చీఫ్ మార్క్ మెడోస్, వైట్‌హౌస్ లాయర్ జాన్ ఈస్ట్‌మన్, మాజీ జస్టిస్ డిపార్ట్మెంట్ జెఫ్రీ క్లార్క్ తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఏడాది నాలుగోసారి ట్రంప్ క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొన్నట్లైంది.






