అమెరికా కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్
అమెరికా కాంగ్రెస్‌కు డెలవేర్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి జాన్ వేలెన్`3తో సారా మెక్ బ్రైడ్ పోటీపడ్డారు. మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. 2016లో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఒక ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ప్రనసంగించిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో డెలవేర్లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనేటర్‌గా వ్యవహరించారు.






