Tiktok : ట్రంప్ అధికారం చేపట్టేవరకు.. దానిపై నిషేధం వద్దు
చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ (Tiktok) ను అమెరికాలో నిషేధం విధించే అవకాశాలపై కీలక పరిణామం చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )అధికార బాధ్యతలు చేపట్టేవరకు దానిపై నిషేధం విధించవద్దని ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టు (Supreme Court) ను కోరారు. వచ్చే ఏడాది జనవరి(January) 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్ నిషేధం కేసుకు సంబంధించి మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీం కోర్టును అభ్యర్థించారు. దీనిపై రాజకీయ తీర్మానం చేపట్టే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు.






