అధ్యక్ష పదవి నిర్ణయించే రాష్ట్రాలివే…
అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించడంలో 12 రాష్ట్రాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఆ పన్నెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు సాదించినవారే అధ్యక్ష అధికార నివాసమైన శ్వేత సౌధంలోకి అడుగుపెట్టనున్నారు. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నవారు అధ్యక్ష పదవిని సొంతం చేసుకోనున్నారు. ఇందులో ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, న్యూహాంప్‌షైర్, ఓహియో, మిచిగాన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, వాషింగ్టన్, మిన్నెసోటా, ఆరిజోనా, నెవాడా, లోవా రాష్ట్రాలు ప్రధానమైవవి. ఇందులో అత్యధికంగా టెక్సాస్‌లో 38 ఎలక్టోలర్ ఓట్లు ఉండగా ప్లోరిడాలో 29, పెన్సిల్వేనియాలో 20, ఓహియోలో 18, జార్జియా 16, మిచిగాన్ 16, నార్త్ కరోలినాలో 15, వాషింగ్టన్లో 10, మిన్నెసొటాలో 10, ఆరిజోనాలో 11 చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ పన్నెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు అధ్యక్ష రేసులో ముందుండే అవకాశం ఉన్నది.






