అమెరికా అధ్యక్షుడిగా ఆ హీరోనే కావాలి…
డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్) అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో దాదాపు సగం మంది ప్రజలు కోరుకొంటున్నారు. అదేంటి యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఎప్పడో ముగిశాయి కదా. మరి కొత్తగా ఇదేంటి అనుకుంటున్నారా. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ప్రముఖ వ్యక్తులలో ఎవరు ఉండాలనే అంశంపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆ సంస్థ అమెరికా ప్రజలను మీకు అధ్యక్షుడిగా డ్వేన్ జాన్సన్ కావాలని కోరుకొంటున్నారా అని ప్రశ్నించగా 46 శాతం మంది అమెరికన్లు అవును అని సమాధానమిచ్చారు.
పోల్‌లో 30,138 మందిని ప్రశ్నించారు. ఈ పోల్‌ను డ్వేన్ జాన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఒక వేళ నేను అమెరికా అధ్యక్షుడిగా అయితే అది ప్రజలకు సేవ చేయడానికి లభించిన అవకాశంగా, గౌరవంగా భావిస్తాను అని అన్నారు. తనకు అమెరికా అధ్యక్ష పదవిపై ఉన్న ఆశను డ్వేన్ జాన్సన్ గతంలోనూ బయపెట్టారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు 2017లో చెప్పారు. ఇప్పటికే రెజ్లర్‌గా, నలుడిగా పుల్ ఫాలోయింగ్ సంపాదించిన జాన్సన్‌కు అదృష్టం ఉంటే భవిష్యత్తులో అధ్యక్ష పదవి కూడా లభిస్తుందేమో.






