ఆయనో నియంత…పాలన తెలియని అధ్యక్షుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ. ఏమాత్రం కట్టుబాట్లు లేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని, ఆయనో ఉగ్రవాది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ అధ్యక్షుడిగా వచ్చినందుకు తామేమీ సంబరపడటం లేదని, అయితే ట్రంప్ వెళ్లిపోతుండటం మాత్రం చాలా ఆనందాన్నిస్తోందని రౌహానీ అన్నారు. తన కేబినెట్‌తో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హమ్మయ్య.. ఇవి ట్రంప్ చివరి రోజులు. ఆయనో నియంత, పాలన తెలియని, ఎలాంటి కట్టుబాట్లు లేని అధ్యక్షుడు, ఓ ఉగ్రవాది, హంతకుడు అని ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రౌహీని. ట్రంప్ స్థానంలో అధ్యక్షుడిగా వస్తున్న బైడెన్.. ఇరాన్‌తో మళ్లీ దౌత్యానికి సిద్ధమని ప్రకటించడం గమనార్హం.






