బైడెన్ పై అభిశంసన విచారణ ప్రారంభించండి.. స్పీకర్ ఆదేశం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణను ప్రారంభించాలని హౌస్ కమిటీని ఆదేశిస్తున్నానని స్పీకరు కెవిన్ మెకార్థి తెలిపారు. బైడెన్ కుటుంబ వ్యాపార లావాదేవీలపై ఈ విచారణ జరగబోతోందని కేపిటల్వద్ద ఆయన వెల్లడిరచారు. హౌస్ ఓవర్‌నైట్ కమిటీ ఇప్పటిదాకా జరిపిన విచారణలో బైడెన్ కుటుంబం చుట్టూ అవినీతి సంస్కృతిలా అల్లుకుపోయిందని తేలింది. అధికార దుర్వినియోగం, అవినీతిపై ఆరోపణలున్నాయి. వీటిపై ప్రతినిధుల సభ సభ్యులతో మరింత లోతుగా విచారణ జరపాలని ఓవర్‌సైట్ కమిటీ సూచించింది అని రిపబ్లికన్ అయిన మెకార్థి పేర్కొన్నారు. అయితే పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకే డెమోక్రాట్ అయిన బైడెన్‌పై ఆయన విచారణకు ఆదేశించారని అంటున్నారు.






