యూఎస్ హౌస్ లో కీలక బిల్లు.. డ్రీమర్స్ కు పౌరసత్వం!
అమెరికా పౌరసత్వం పొందాలనుకుంటున్న డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కలలు త్వరలోనే నిజమవబోతున్నాయి. ఇరు పక్షాల అంగీకారంతో సెనేటర్ల బృందం అమెరికాన్ చిల్డ్రెన్స్ యాక్ట్ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు విజయవంతంగా చట్టంగా మారితే 2 లక్షలకు పైగా మది డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ ప్రయోజనం పొందుతారు. ఇందులో భారతీయ పిల్లలే అత్యధికంగా ఉండనున్నారు. తల్లిదండ్రుల వీసాపై ఆధారపడి అమెరికాలో పెరిగిన పిల్లలు, యువత 21 ఏళ్లు నిండిన తర్వాత అమెరికాను వీడాల్సిన అవసరం ఉండదు. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అమెరికా పౌరసత్వం పొందేందుకు ఈ బిల్లు బాటలు వేయనుందని బిల్లును ప్రవేశపెట్టిన సెనేటర్లు అలెక్స్ పడిల్లా, రాండ్ పాల్ అన్నారు. ఈ బిల్లుకు పలువురు సెనేటర్ల మద్దతు ఉందన్నారు.
కాంగ్రెస్ దెబోరా రోస్ ఇదివరకు ఇదే బిల్లును హౌస్‌లో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. జీవితంలో ఎక్కువ కాలం అమెరికాలో గడిపిన డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు వెన్ను చూపించకూడదని పడిల్లా వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న ఈ వర్గానికి 21 ఏళ్లు నిండగానే ముప్పులోకి జారుకుంటున్నారని పేర్కొన్నారు. డ్రీమర్స్ అమెరికాలోనే తమ కలలను నెరవేర్చుకునేందుకు అవకాశం పొందేందుకు అర్హత కలిగి వున్నారన్నారు. అమెరికాలో తమ నివాసాన్ని కలిగి వుండొచ్చని సెనేటర్ తెలిపారు.






