డొనాల్డ్ ట్రంప్ కు షాక్.. వైదొలగిన మరో పోటీదారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున మరోసారి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌నకు సొంత పార్టీలో ప్రత్యర్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ ప్రకటించారు. రిపబ్లికన్ ఓటర్లతో అత్యధికులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు ఇస్తున్నందున తాను ఆయనకు అనుకూలంగా పోటీ నుంచి విరమించుకొంటున్నానని తెలిపారు. దీంతో ఇప్పుడు పార్టీ నామినేషన్ కోసం ట్రంప్‌తో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ (2) ఒక్కరే పోటీపడుతతున్నారు. భారత సంతతి అమెరికన్ వివేక్ రామ స్వామి ఇప్పటికే అధ్యక్ష బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.






