అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయు సత్తా
అమెరికా కాంగ్రెస్కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రవాస భారతీయులు సత్తా చాటారు. అధికార డెమోక్రాటిక్ పార్టీ నుంచి నలుగురు గెలుపొందారు. థానేదార్, రాజా కృష్ణమూర్తి, రోఖన్నా, ప్రమీలా జయపాల్ యుఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. బుధవారం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఖన్నా, కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ వరుసగా నాల్గవసారి ఎన్నికల్లో పోటీ చేశారు. భారత సంతతి నేతల్లో అత్యంత సీనియర్ అయిన అమీబెరా కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఆరవసారి పోటీ చేశారు. ఆ స్థానంలో ఫలితం వెలువడాల్సి ఉంది. మరోవైపు టెక్సాస్ నుంచి పోటీ చేసిన సందీప్ శ్రీవాస్తవ ఓటమి పాలయ్యారు. మాజీ కోలిన్ కౌంటీ న్యాయమూర్తి కీత్ సెల్స్తో చేతిలో పరాజయం చెందారు. 33.19 కోట్ల అమెరికా జనాభాలో భారత సంతతి పౌరుల సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే. అయినా అగ్రరాజ్యంలో కీలక బాధ్యతల్లోకి దూసుకెళ్లడంలో ముందంజలో ఉంటున్నారు.






