నీరా టాండన్ కు రిపబ్లికన్ లు షాక్…
భారతీయ అమెరికన్ నీరా టాండన్ను నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన బృందంలో కీలక స్థానానికి ఎంచుకోవడంపై రిపబ్లికన్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నీరాను డైరెక్టర్ ఫర్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పదవికి బైడెన్ ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రిపబ్లికన్ సెనేటర్లు స్పందిస్తూ ఇది అతి చెత్త ఎంపిక అంటూ విమర్శించారు. గతంలో ఆమె రిపబ్లికన్ సెనేటర్లపై ట్విటర్లో అవమానకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. గత రెండు వారాల్లోనే ఆమె తన ఖాతా నుంచి వెయ్యికి పైగా ట్వీట్లను తొలగించారని వెల్లడించారు. కాగా నీరా అభ్యర్థిత్వాన్ని సెనేట్ కూడా ఆమోదిస్తేనే ఆమె ఎంపిక అధికారమవుతుంది. అయితే 100 స్థానాలున్న సెనేట్లో రిపబ్లికన్ సభ్యులు 50 మంది ఉండగా, డెమొక్రాట్లు 48 మంది ఉన్నారు. మరో రెండు స్థానాలకు జనవరి 5న ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో నీరాకు రిపబ్లికన్లు మద్దుతు ఇస్తారా అన్నది ప్రశ్నార్థంగా మారింది.






