జో బైడెన్ అభిశంసన కోసం విచారణ ప్రారంభం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిశంసన కోసం కొన్ని నెలల పాటు కసరత్తు చేసిన రిపబ్లికన్ హౌస్ కమిటీలు అధికారికంగా విచారణను ప్రారంభించాయి. ఓవర్సైట్, జ్యుడీషియరీ, వేస్ అండ్ మీన్స్ కమిటీల చైర్మన్లు అభిశంసనపై తమ మొదటి విచారణను ప్రారంభించారు. తమ విచారణకు రాజ్యాంగ, న్యాయపరంగా ఎదురయ్యే ప్రశ్నలపై సమీక్ష జరిపారు. బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ విదేశీ వ్యాపారాల సంబంధాలపై సాక్ష్యాలను చూపించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా గట్టి ఆధారాలేవీ వారికి లభించలేదు. చట్టసభ సభ్యులవద్ద కొండంత ఆధారాలున్నాయని, అవి అధ్యక్షుడు బైడెన్ కుటుంబ కోసం తన అధికారాలను దుర్వినియోగం చేశారని చెబుతున్నాయని ఓవర్సైట్ కమిటీ చైర్మన్ జేమ్స్ కామర్ తెలిపారు.






