ఆ విశ్వాసంతోనే అధ్యక్ష బరిలోకి : వివేక్
హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చిందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి తెలిపారు. ది ఫ్యామిలీ లీడర్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హిందూ మతం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసం. నేను హిందూ సంప్రదాయ కుటుంబలో పెరిగా. కుటుంబం, వివాహ బంధం విలువల గురించి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు అని వ్యాఖ్యానించారు.






