రికార్డు స్థాయిలో మహిళలు గెలుపు
అమెరికా రాజకీయ చరిత్రలో మహిళలు భారీగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇప్పటి వరకు 106 మంది మహిళా అభ్యర్థులు గెలుపొందారు. 29 మంది ముందంజలో ఉన్నారు. పురుష అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. 29 మంది మహిళలు గెలుపు లాంఛనమే అయినప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటి వరకు గెలిచిన 106 మంది మహిళ అభ్యర్థుల్లో 83 మంది డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారు కాగా, 23 మంది రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. 2018 రికార్డును అధిమించింది.
ఈ ఏడాది ప్రతినిధుల సభకు పోటీపడుతున్న మహిళలు మునపటి రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టారు. 2018లో 476 మంది పోటీలో నిలవగా ఈసారి రికార్డు స్థాయిలో 583 మంది ఎన్నికలలో తమ లక్‌ను తెలుసుకునేందుకు బరిలో నిల్చుకున్నారు. 2018లో హౌస్ రేస్‌కు మహిళా అభ్యర్థుల సంఖ్యకు డెమొక్రాట్లు ఎక్కువ సహకారం అందించారు. ఈ సంవత్సరం రిపబ్లికన్లు కూడా విజయం సాధించడానికి మహిళలకు తమ వంతు సహకారం చేశారు. సెనేట్‌లో ఈ సంవత్సరం మహిళ ప్రాతినిథ్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 25 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ సెనేట్‌లో పని చేస్తున్న మహిళలకు 26 మంది ఎగువ సభకు ఎన్నికయ్యారు. 2020లో రాష్ట్ర శాసన సభ నామినీల పరంగా మహిళలు కూడా కొత్త రికార్డులను సృష్టించారు. దేశ వ్యాప్తంగా రేసుల్లో 3,444 మంది మహిళలు రాష్ట్ర శాసన సభ స్థానాలకు నామినేట్ అయ్యారు. ఇంతకు ముందు 2018లో నెలకొల్పిన 3,418 రికార్డు ఈ ఏడాది తుడిచిపెట్టుకుపోయింది.






