ముందస్తు ఓటేసిన భారతీయులు…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్ జోరుగా సాగింది. దాదాపు 9.8 కోట్ల మంది ముందస్తు ఓటింగ్లో పాల్గొన్నారు. అమెరికా ఎన్నికల చరిత్రలోనూ ఇదో రికార్డు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ రోజు కన్నా ముందే ఇంత భారీ సంఖ్యలో అమెరికన్లు ఓటు వేయడం ఇదే మొదటిసారి. అయితే భారత సంతతి ఓటర్లు కూడా ఈసారి అత్యధిక సంఖ్యలో ముందస్తు ఓటింగ్లో పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా.. చాలా వరకు ఓటర్లు ముందే ఓటేశారు. అబ్సెంట్ బ్యాలెట్గా పిలువబడే ముందస్తు ఓటింగ్ అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది. ఇవాళ జరిగే పోలింగ్లో ట్రంప్, బైడెన్ భవితవ్యం తేలనున్నది.






