ఫ్రీమాంట్ మేయర్‌గా రాజ్ సల్వాన్
ఇటీవల జరిగిన ఫ్రీమాంట్ మేయర్ ఎన్నికల్లో రాజ్ సల్వాన్ విజయాన్ని సాధించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు ఈ పోటీలో నిలిచారు. రాజ్ సల్వాన్ కు ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనకు అనేకమంది అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నీ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఫ్రీమాంట్ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషికి తగిన గుర్తింపు లభించింది. ప్రజా భద్రతకు, మౌళిక సదుపాయాల కల్పనకు, స్థానిక వ్యాపారుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషిని గుర్తించిన ఫ్రీమాంట్ నగర ప్రజలు తమ ఓటు హక్కుతో ఆయనకు మద్దతును అందించారు. వివిధ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ, అందరిట సంక్షేమానికి కృషి చేస్తున్న రాజ్ సల్వాన్ వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను అందుకున్నారు.
ఫ్రీమాంట్ కౌన్సిల్ మెంబర్‌గా, నగర వైస్ మేయర్‌గా రెండుసార్లు ఆయన వ్యవహరించారు. అలాగే ఫ్రీమాంట్ హ్యూమన్ రిలేషన్స్ కమీషనర్‌గా, అలమేడా కౌంటీ ట్రాన్స్ పోర్ట్ కమీషన్ లో కూడా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి గుర్తింపు తెచ్చేలా ఆయన చేసిన కృషిని గమనించిన అన్నీ వర్గాల ప్రజలు ఈ మేయర్ ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం విశేషంగా కృషి చేశారు.
కాంగ్రెస్‌మెన్ రో ఖన్నాతోపాటు, తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు జయరాం కోమటితోపాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఆయన విజయానికి బాసటగా నిలిచారు. ఆయన విజయం పట్ల పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు.






