Rahul Gandhi: బాధ్యతల నిర్వహణలో ఈసీ రాజీ : అమెరికాలో రాహుల్ విమర్శ

భారత ఎన్నికల కమిషన్ తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. గత సంవత్సరం మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగే ఇందుకు సాక్ష్యమన్నారు. ఈ విషయాన్ని తాను గతంలోనూ లేవనెత్తానని, వ్యవస్థలో లోపం ఉందని రాహుల్ తన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్ (Boston)లో జరిగినన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. తేలికగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఓటు వేసే వయసున్న మొత్తం వ్యక్తుల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని రాహుల్ వెల్లడిరచారు. ఎన్నికల కమిషన్ సాయంత్రం 5:30 కి పోలైన ఓట్ల సంఖ్య వెల్లడిరచింది. అయితే ఆ తర్వాత 5:30 నుంచి 7:30 మధ్య కాలంలో 65 లక్షల మంది ఓటేసినట్టు తెలిపింది. ఇంత తక్కువ సమయంలో అంతమంది ఓటేయడం అసాధ్యం. ఒక ఓటరు ఓటేయడానికి దాదాపు మూడు నిమిషాల సమయం పడుతుంది. పోలైన ఓట్ల సంఖ్యను బట్టి చూస్తే మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగి ఉండాలి. కానీ అలా జరగలేదు అని ఆయన అన్నారు. ఓటింగుకు సంబంధించిన వీడియోలు (Videos) ఇవ్వమని మేముడిగితే అందుకు తిరస్కరించడమే కాదు వీడియోలు అందించే వీల్లేకుండా చట్టాన్నే మార్చేశారు. ఎన్నికల కమిషన్ (Election Commission) తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిపోయిందన్నది స్పష్టం. అంతే కాక వ్యవస్థలోనే ఏదో లోపముందని కూడా తెలుస్తోంది. ఈ విషయం నేను అనేక సార్లు చెప్పాను అని రాహుల్ అన్నారు.