హారిస్‌పై పుతిన్ ప్రశంసలను తప్పుబట్టిన అమెరికా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు తన మద్దతు ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించడంపై అమెరికా స్పందించింది. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని స్పష్టం చేసింది. కమలా హారిస్‌కు మద్దతిస్తున్నానని, తనపై ప్రశంసలు కురిపించిన ట్రంప్‌నకు కాదంటూ పుతిన్ పేర్కొన్న నేపథ్యంలో వైట్‌హైస్ స్పందించింది. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే అభినందిస్తాం. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఆపండి అని అమెరికా శ్వేతసౌధం జాతీయ భద్రత సమాచార ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.






