John F. Kennedy : కెన్నడీ హత్య కేసు రహస్యాలు : ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ (John F. Kennedy) హత్య కేసుకు సంబంధించిన దస్త్రాలను విడుదల చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) తాజాగా ప్రకటించారు. తన యంత్రాంగం ఆ దస్త్రాలను ప్రజల ముందుకు ఉంచుతుందని తెలిపారు. వాషింగ్టన్ (Washington) లోని కెన్నడీ పేరు మీదున్న కళల ప్రదర్శన వేదిక అయిన కెన్నడీ సెంటర్ (Kennedy Center ) ను ట్రంప్ సందర్శించారు. ఈ సందర్భంగా కెన్నడీ హత్యకు సంబంధించి అన్ని దస్త్రాలను బయటపెడుతున్నట్లు మీడియా ఎదుట ట్రంప్ వెల్లడిరచారు.